![]() |
![]() |

రానున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్షునిగా పోటీ చేస్తున్న ప్రకాశ్‌రాజ్‌ను ఓడించమని 'మా' సభ్యులకు సీనియర్ నటుడు సీవీఎల్ నరసింహారావు పిలుపునిచ్చారు. 'మా' ఎన్నికల్లో మొదట అధ్యక్షునిగా పోటీ చేసేందుకు నామినేషన్ వేసిన ఆయన, ఆ తర్వాత దానిని ఉపసంహరించుకున్నారు. లేటెస్ట్‌గా ఆయన ఓ వీడియో మెసేజ్ ద్వారా మాట్లాడుతూ మా ఎన్నికల బరిలో ఉన్న తెలంగాణ వారినందర్నీ గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
"ఈ ఎన్నికల్లో మీరు తెలంగాణ బిడ్డలందర్నీ దయచేసి గెలిపించండి. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా బాబూమోహన్ గారినీ, జాయింట్ సెక్రటరీగా ఉత్తేజ్‌నీ, అలాగే రెండు ప్యానల్స్‌లో ఉన్న తెలంగాణ బిడ్డల్ని గెలిపించండి. తెలంగాణ గడ్డమీద ఉన్న 'మా'కు సంబంధించినంత వరకు తెలంగాణ బిడ్డ ఓడిపోతే అది ఈ రాష్ట్రానికే మంచిది కాదు, సమాజానికి మంచిది కాదు, సినీ పరిశ్రమకు మంచిది కాదు" అని ఆయన అన్నారు.
ఇంకో విషయం కూడా ఆయన స్పష్టంగా చెప్పారు. "దేశమన్నా, దేవుడన్నా, ధర్మమన్నా చులకన భావం ఉన్న ప్రకాశ్‌రాజ్‌ను ఈ ఎన్నికల్లో తప్పకుండా ఓడించండి. ఎందుకంటే అనేక సెల్ఫ్ కాంట్రాడిక్షన్స్‌తో అతను మాట్లాడుతున్నాడు. అంతేకాదు, నేను.. నేను అని తప్ప మరో విషయం పట్టని మనిషి. అతను ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉంటేనే బాగుంటుంది. బహుశా అతను విత్‌డ్రా చేసుకుంటాడని కూడా నేను ఆశిస్తున్నాను." అని అన్నారు నరసింహారావు.
![]() |
![]() |