![]() |
![]() |

విడాకుల ప్రకటన తర్వాత అక్కినేని నాగచైతన్య నుండి మరో మాట బయటకు రాలేదు. కానీ, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సమంత అలా కాదు. ఎప్పటికప్పుడు మనసులో భావాలను బయట పెడుతూ వస్తున్నారు. సోషల్ మీడియా అకౌంట్స్‌లో తన పేరును సమంతగా మార్చుకున్నారు.
ఆ తర్వాత 'ఈ ప్రపంచాన్ని మార్చాలంటే ముందు నన్ను నేను మార్చుకోవాలి. నా బెడ్ రూమ్ నేనే క్లీన్ చేసుకోవాలి. మిట్ట మధ్యాహ్నం వరకూ నిద్రపోకూడదు. కలలు కనడం మానేసి చేయాల్సిన పనుల మీద దృష్టి పెట్టాలి' అని లిరిక్స్ ఉన్న సాంగ్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశారు. లేటెస్టుగా మరో పోస్ట్ చేశారు.
సమంతకు మూగజీవాలు అంటే ప్రేమ అన్న సంగతి తెలిసిందే. ఆమె దగ్గర రెండు కుక్కపిల్లలు.. హ్యాష్, సాషా.. ఉన్నాయి. వర్కవుట్లు చేసేటప్పుడు వాటిని జిమ్‌కు తీసుకువెళతారు. అక్కడ అవి చేసే అల్లరిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. గురువారం ఉదయం ఆ రెండు కుక్కపిల్లను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశారు. లవ్ సింబల్ ఒకటి వాటి మీద వేశారు. దీన్నిబట్టి ఆ రెండిటితో ప్రజెంట్ ప్రేమలో ఉన్నానని పరోక్షంగా చెప్పే ప్రయత్నం చేశారు.
![]() |
![]() |