![]() |
![]() |

అభిమానులను సొంత మనుషుల్లా భావించే అతి కొద్దిమంది హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. అభిమాని కష్టాలలో ఉన్నట్లు తెలిస్తే చాలు ఎన్టీఆర్ వెంటనే స్పందిస్తారు. తాజాగా చావు బతుకులలో ఉన్న అభిమానితో మాట్లాడి తాను ఉన్నానన్న భరోసాను ఇచ్చారు.
తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలం గూడపల్లి గ్రామానికి చెందిన కొప్పాడి మురళి ఎన్టీఆర్ వీరాభిమాని. అయితే మురళి ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై.. రెండు కిడ్నీలు పాడైపోయి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. దీంతో తనకు ఎన్టీఆర్ ను చూడాలని ఉందని, ఎన్టీఆర్‌తో మాట్లాడాలని ఉందని.. డాక్టర్ కు పేపర్ రాసి ఇచ్చాడు. ఈ విషయం తన అభిమానుల ద్వారా తెలుసుకున్న ఎన్టీఆర్.. వీడియో కాల్ చేసి మురళితో మాట్టాడారు. త్వరలోనే కోలుకుంటావంటూ అతడిలో ధైర్యం నింపారు. సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా తిరిగి వస్తావని, త్వరలో మనం కలుద్దామని ఎన్టీఆర్ చెప్పారు. తన అభిమాన హీరో ఫోన్ చేసి మాట్లాడడంతో మురళి అంతులేని ఆనందం వ్యక్తం చేశాడు.

సినిమాల విషయానికొస్తే ఎన్టీఆర్ ప్రస్తుతం రామ్ చరణ్ తో కలిసి రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ఆర్ఆర్' చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 7 న విడుదల కానుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత కొరటాల శివ, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్స్ లైన్ లో ఉన్నాయి.
![]() |
![]() |