![]() |
![]() |

టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఆదరణ పొందుతోంది కన్నడ బ్యూటీ రష్మిక మందన్న. ఆమె చేతిలో పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులున్నాయి. హార్డ్ వర్క్‌ను నమ్ముకున్న ఆమె, డబ్బును ఆస్తుల్లో పెట్టుబడిగా పెడుతోంది. హైదరాబాద్, గోవా, కూర్గ్‌లలో ఇప్పటికే ఇళ్లు కొనుక్కున్న ఆమె ఇటీవల ముంబైలోనూ ఓ ఇంటికి యజమానురాలయ్యింది. ఆమె కొత్త ఇంటిని చూసి, ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు.
ప్రస్తుతం బాలీవుడ్‌లో సినిమాలు చేస్తుండటంతో, సజావుగా వర్క్ చేసుకొనేందుకు ముంబైలో ఇల్లు కొనుగోలు చేసింది రష్మిక. ఇంతకుముందు ఓ హోటల్‌లో ఉంటూ వచ్చిన ఆమె, ఇప్పుడు ముంబైలోని ఓ విలాసవంతమైన ఇంటికి యజమానురాలిగా మారింది. బాలీవుడ్‌లో 'మిషన్ మజ్ను', 'గుడ్‌బై' సినిమాలు చేస్తుండటంతో హైదరాబాద్, ముంబైల మధ్య తరచూ జర్నీ చేస్తోంది రష్మిక. ఇప్పుడు ముంబైలో సొంత ఇల్లు ఉండటంతో ఆమెకు సౌకర్యంగా అనిపిస్తోంది. సిటీకి తను మరింత సన్నిహితం అయినట్లు ఆమె భావిస్తోంది. అని సన్నిహిత వర్గాలు తెలిపాయి.
వర్క్ విషయానికి వస్తే, రష్మిక చేతిలో ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ సినిమాలున్నాయి. అల్లు అర్జున్ జోడీగా 'పుష్ప', శర్వానంద్ జోడీగా 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమాల్లో నటిస్తోన్న ఆమె, హిందీలో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన 'మిషన్ మజ్ను', అమితాబ్ కాంబినేషన్‌తో 'గుడ్‌బై' మూవీస్ చేస్తోంది.
![]() |
![]() |