![]() |
![]() |

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న మూవీ 'f3'. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ 'f2'కు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే తాజాగా ఈ సినిమా సెట్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సందడి చేశారు.
'f3' మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ షెడ్యుల్ లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే f3 మూవీ టీమ్ కి అల్లు అర్జున్ సర్ ప్రైజ్ ఇచ్చారు. 'f3' మూవీ షూటింగ్ సెట్ కి వెళ్లి అందరిని ఆశ్చర్యపరిచారు. వెంకటేష్, వరుణ్ తేజ్‌తో పాటు ఇతర టీమ్ ని కలిసి కాసేపు ముచ్చటించారు. అల్లు అర్జున్ 'f3' సెట్ లో సందడి చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో తమన్నా, మెహరీన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సునీల్ ,రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
ఇక అల్లు అర్జున్ విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' సినిమా చేస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. మొదటి భాగం డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.
![]() |
![]() |