![]() |
![]() |

లోక నాయకుడు కమల్ హాసన్ నేరుగా నటించిన తెలుగు చిత్రాల్లో సింహభాగం విజయఢంకా మ్రోగించాయి. వాటిలో `ఒక రాధ - ఇద్దరు కృష్ణులు` ఒకటి. హిలేరియస్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో కమల్ కి జంటగా అతిలోక సుందరి శ్రీదేవి నటించగా రావుగోపాలరావు, రాజేంద్ర ప్రసాద్, సత్యనారాయణ, అన్నపూర్ణ, నూతన్ ప్రసాద్, రమణ మూర్తి, నిర్మలమ్మ, సుత్తి వీరభద్రరావు, పీజే శర్మ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. అగ్ర దర్శకుడు ఎ. కోదండరామిరెడ్డి రూపొందించిన ఈ చిత్రం.. ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ రచించిన `ఒక రాధ - ఇద్దరు కృష్ణులు` నవల ఆధారంగా తెరకెక్కింది.
ఈ చిత్రానికి మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా సంగీతమందించగా.. దిగ్గజ గీత రచయిత వేటూరి సుందరరామ్మూర్తి సాహిత్యమందించారు. పాటల్లో.. ``మధుర మురళి`` అంటూ సాగే గీతం చార్ట్ బస్టర్ గా నిలిచింది. అలాగే ఇందులోని ఐదు పాటల్లో నాలుగింటిని ఎస్పీ బాలసుబ్రమణ్యం, జానకి గానం చేయగా.. ``వేయ్ వేయ్`` అంటూ సాగే గీతాన్ని కమల్ హాసన్ స్వయంగా ఆలపించడం విశేషం. 1986 అక్టోబర్ 2న విడుదలైన `ఒక రాధ - ఇద్దరు కృష్ణులు`.. నేటితో 35 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |