![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవి - అగ్ర దర్శకుడు ఎ. కోదండరామి రెడ్డి - మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా - క్రియేటివ్ కమర్షియల్స్ బేనర్.. కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలు తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. వాటిలో `రాక్షసుడు` ఒకటి. యండమూరి వీరేంద్రనాథ్ రచించిన `రాక్షసుడు` నవల ఆధారంగా అదే పేరుతో రూపొందిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించింది. చిరంజీవి కెరీర్ లో ఓ మెమరబుల్ మ్యూజికల్ ఎంటర్టైనర్ గా నిలిచింది. అంతేకాదు.. చిరు సోదరుడు నాగబాబు ఈ సినిమాతోనే నటుడిగా తొలి అడుగేయడం విశేషం.
చిరుకి జంటగా రాధ, సుహాసిని నటించిన ఈ చిత్రంలో సుమలత, రావుగోపాలరావు, అన్నపూర్ణ, టైగర్ ప్రభాకర్, రాజేంద్ర ప్రసాద్, సంయుక్త, జయమాల ఇతర ముఖ్య పాత్రల్లో అలరించారు. లోక్ సింగ్ ఛాయాగ్రహణం, ఎం.వి.ఎస్. హరనాథరావు సంభాషణలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఇళయరాజా సంగీతసారథ్యంలో రూపొందిన పాటలన్నీ రంజింపజేశాయి. ``మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు``, ``అచ్చా అచ్చా``, ``నీ మీద నాకు``, ``హే నాటీ``, ``గిలిగా`` , ``జయ జయ``.. ఇలా ఇందులోని గీతాలన్ని సంగీతప్రియులను ఎంతగానో అలరించాయి. 1986 అక్టోబర్ 2న విడుదలై అఖండ విజయం సాధించిన `రాక్షసుడు`.. నేటితో 35 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |