![]() |
![]() |

తెలుగు పరిశ్రమలో రాజీవ్ కనకాల, సుమ జంట ఈమధ్య తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఇద్దరూ వేరు పడుతున్నారని గుసగుసలు వినిపించడమే అందుకు కారణం! కొంతమంది ఓ అడుగు ముందుకేసి విడాకులు తీసుకుంటున్నారని రాసేశారు. 'నారప్ప' విడుదల సమయంలో అటువంటి వార్తలపై రాజీవ్ కనకాల స్పందించారు. సుమకు దూరంగా ఎందుకు ఉంటున్నారో చెప్పారు. అయితే, సుమ ఎప్పుడూ నేరుగా స్పందించలేదు.
'లవ్ స్టోరీ' ప్రచార కార్యక్రమాల్లో భాగంగా నాగచైతన్య, సాయి పల్లవి, శేఖర్ కమ్ములను సుమ ఇంటర్వ్యూ చేశారు. అందులో మా ఆయన రాజీవ్ కనకాల ఎలా చేశాడని అడిగారు. మేమిద్దరం మా ప్రొఫెషనల్ వర్క్ గురించి డిస్కస్ చేసుకోమని చెప్పారు. రాజీవ్ గురించి సుమ మాట్లాడటంతో తమ మధ్య ఏ గొడవలు లేవని చెప్పినట్టు అయ్యింది.
సినిమా విడుదలైన తర్వాత రాజీవ్ కనకాల యాక్టింగ్ గురించి మరో పోస్టు చేశారు సుమ. "కథలో ప్రేక్షకులు లీనమయ్యేలా నటించగల అతికొద్ది మంది నటుల్లో నా భర్త(డియరెస్ట్ హబ్బీ) ఒకరు" అని సుమ పేర్కొన్నారు. దాంతో మరోసారి పుకార్లకు చెక్ పెట్టినట్టు అయ్యింది. విడాకుల వార్తలకూ సమాధానం చెప్పినట్టు అయ్యింది. మొత్తానికి 'లవ్ స్టోరీ' సినిమాను సుమ భలే వాడుకున్నారు.
![]() |
![]() |