![]() |
![]() |
.jpg)
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. 'మా' జనరల్ సెక్రటరీ పదవికి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న బండ్ల గణేష్ పోటీ నుంచి తప్పుకున్నారు. నిన్నటివరకు మిగతా పదవులు ఎవరికైనా ఓటు వేసుకోండి.. జనరల్ సెక్రటరీ పదవికి మాత్రం నాకు ఓటు వేయండి అంటూ ప్రచారం చేసిన బండ్ల ఇప్పుడు పోటీ నుండి తప్పుకోవడం హాట్ టాపిక్ గా మారింది.
'మా' అధ్యక్ష బరిలో ఉన్న ప్రకాష్ ప్యానల్ లో మొదట బండ్ల గణేష్ ఉన్నారు. అయితే ఆ ప్యానల్ లోకి జీవితా రాజశేఖర్ ఎంటర్ అవ్వడంతో.. ఆ ప్యానల్ నుండి బయటకు వచ్చారు. అంతేకాదు ఆమెపై ఇండిపెండెంట్ గా జనరల్ సెక్రటరీ పదవికి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. రీసెంట్ గా నామినేషన్ కూడా వేసిన బండ్ల.. ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇలాంటి సమయంలో తన నామినేషన్ ను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించి బండ్ల గణేష్ అందరికీ షాకిచ్చారు.

ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ లతో దిగిన ఫోటోను ట్విట్టర్ వేదికగా పంచుకున్న బండ్ల గణేష్.. "నా దైవ సమానులు, నా ఆత్మీయులు, నా శ్రేయోభిలాషుల సూచనల మేరకు నేను 'మా' జనరల్ సెక్రటరీ నామినేషన్ ను ఉపసంహరించుకుంటున్నాను" అని ట్వీట్ చేశారు.
![]() |
![]() |