![]() |
![]() |

విజయ్ సేతుపతి, నయన తార, సమంత ప్రధాన తారాగణంగా తెరకెక్కిన తమిళ చిత్రం 'కాదు వాకుల రెండు కాదల్'. విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం దీపావళి కానుకగా నవంబర్ 4న డైరెక్ట్ ఓటీటీలో విడుదల కానుందని తెలుస్తోంది.
కరోనా సెకండ్ వేవ్ అనంతరం థియేటర్లు తెరుచుకున్నాయి. ఇప్పటికే పలు సినిమాలు థియేటర్ల బాట పట్టాయి. ఈ నేపథ్యంలో 'కాదు వాకుల రెండు కాదల్' చిత్రం ఓటీటీలో విడుదల అవుతుండటం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతుంది. అయితే కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో నాటి పరిణామాల దృష్ట్యా ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలని నిర్మాతలు భావించారట. ఆ క్రమంలో ఓటీటీలో విడుదల చేసేలా ఒప్పందాలు జరిగినట్లు సమాచారం.
డైరెక్ట్ ఓటీటీలో విడుదలవుతున్న సమంత తొలి చిత్రం ఇదే కావడం విశేషం. కాగా క.పె.రణసింగం, తుగ్లక్ దర్బార్, అన్నాబెల్లె సేతుపతి సినిమాల్లో విజయ్ సేతుపతి నటించారు. ఈ సినిమాలు ఓటీటీలో విడుదల అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన నటించిన 'కాదు వాకుల రెండు కాదల్' చిత్రం కూడా ఓటీటీలో విడుదలకానుంది.
![]() |
![]() |