![]() |
![]() |

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇప్పటివరకు తొమ్మిది చిత్రాలతో సందడి చేశాడు. వీటిలో `తొలిప్రేమ`(2018) మాత్రమే కొత్త దర్శకుడి (వెంకీ అట్లూరి) కాంబినేషన్ లో తెరకెక్కగా.. మిగిలిన చిత్రాలన్నీ కూడా సీనియర్, ఎక్స్ పీరియన్స్డ్ డైరెక్టర్స్ కాంబోలో చేశాడు వరుణ్. కట్ చేస్తే.. స్వల్ప విరామం అనంతరం వరుణ్ మరో నూతన దర్శకుడితో సినిమా చేస్తున్నాడు. ఆ చిత్రం `గని` కాగా.. ఆ దర్శకుడు కిరణ్ కొర్రపాటి. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ స్పోర్ట్స్ డ్రామా చిత్రీకరణ తుది దశలో ఉంది. దీపావళి కానుకగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ థియేటర్స్ లో సందడి చేయనుంది.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. వరుణ్ ఫస్ట్ టైమ్ డెబ్యూ డైరెక్టర్ తో చేసిన `తొలిప్రేమ`కి సంగీతమందించిన తమన్, ఛాయాగ్రహణం అందించిన జార్జి సి. విలియమ్స్.. సెకండ్ టైమ్ డెబ్యూ డైరెక్టర్ తో చేస్తున్న `గని`కి కూడా కలిసి పనిచేస్తున్నారు. మరి.. `తొలిప్రేమ` తరహాలో `గని` కూడా బాక్సాఫీస్ ముంగిట సక్సెస్ ఫుల్ వెంచర్ గా నిలుస్తుందేమో చూడాలి.
ఇదిలా ఉంటే, `గని`లో సయీ మంజ్రేకర్ నాయికగా నటిస్తుండగా జగపతి బాబు, ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర, నదియా ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు.
![]() |
![]() |