![]() |
![]() |

తెలుగునాట ప్రస్తుతం `బుట్టబొమ్మ` పూజా హెగ్డే హవా నడుస్తోంది. ఒకవైపు స్టార్ హీరోలతోనూ.. మరోవైపు రైజింగ్ హీరోలతోనూ ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేస్తూ వరుస సినిమాలతో ముందుకు సాగుతోంది ఈ టాలెంటెడ్ యాక్ట్రస్.
ఇదిలా ఉంటే.. రీసెంట్ టైమ్స్ లో పూజా హెగ్డే ఫిల్మోగ్రఫీని గమనిస్తే ఓ విషయం స్పష్టం. అదేమిటంటే.. వరుసగా పండగ సీజన్స్ లోనే ఆమె చిత్రాలు తెరపైకి వస్తున్నాయి. ఆమె ప్రీవియస్ హిందీ మూవీ `హౌస్ ఫుల్ 4` 2019 దీపావళికి సందడి చేయగా.. గత తెలుగు చిత్రం `అల వైకుంఠపురములో` 2020 సంక్రాంతికి జనం ముందు నిలిచింది. ఇక ఆమె తాజా చిత్రం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` విషయానికి వస్తే 2021 దసరా కానుకగా విడుదలకు సిద్ధమైంది. అంతేకాదు.. ఆమె నెక్స్ట్ ఫిల్మ్ `రాధే శ్యామ్` సంగతే తీసుకుంటే.. 2022 సంక్రాంతి సీజన్ లో రిలీజ్ కి రెడీ అవుతోంది. మొత్తమ్మీద.. పూజా హెగ్డే నాలుగు వరుస చిత్రాలు ఫెస్టివల్ సీజన్స్ లోనే వినోదాలు పంచడం విశేషం. మరి.. మున్ముందు కూడా ఇదే శైలిలో ఆమె ఫిల్మోగ్రఫీ సాగుతుందేమో చూడాలి.
అన్నట్టు.. పూజ స్పెషల్ రోల్ లో నటించిన `ఆచార్య` కూడా 2021 దీపావళికి గానీ లేదా 2022 సంక్రాంతికి గానీ రిలీజ్ కావచ్చని ప్రచారం సాగుతోంది.
![]() |
![]() |