![]() |
![]() |

కన్నడ బుల్లి తెర నటి సౌజన్య తన అపార్ట్‌మెంట్‌లోని ప్లాట్‌లో గురువారం ఆత్మహత్య చేసుకుంది. తన ఆత్మహత్యకు ఎవరు కారణం కాదని తన నాలుగు పేజీల సూసైడ్ నోట్‌లో ఆమె పేర్కొంది. సౌజన్య సూసైడ్ నోటును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, ఆమె మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
విచారణలో భాగంగా సౌజన్య తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు, అపార్ట్‌మెంట్ వాసులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అయితే గతకొద్ది రోజులుగా సౌజన్య పని ఒత్తిడితో ఆరోగ్య సమస్యలతో సతమతమవుతోందని.. ఈ నేపథ్యంలో ఆమె మానసిక ఆరోగ్యం సరిగ్గా లేదని.. దాంతో ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చి ఉంటుందని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. అయితే తనకు సహాయం చేసిన వారికి సౌజన్య.. సూసైడ్ నోట్‌లో ధన్యవాదాలు తెలిపింది.
సౌజన్య పలు టీవీ సీరియల్స్‌తోపాటు రెండు చిత్రాల్లో కూడా నటించింది. బులి తెర నటి సౌజన్య మృతి పట్ల కన్నడ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
![]() |
![]() |