![]() |
![]() |

సూపర్‌స్టార్ మహేశ్ బాబు.. సైలెంట్‌గా తన చిత్రాలు తాను చేసుకుంటూ పోతుంటాడు. సినిమా ఫంక్షన్లు, ప్రెస్ మీట్లు, ఆడియో ఫంక్షన్లు, సినిమా ఓపినింగ్స్... వీటన్నిటికి ఆయన దూరంగా ఉంటారనే చెప్పాలి. తన బంధువులకు సంబంధించిన సినిమాల ఫంక్షన్లకు మాత్రం అప్పుడప్పుడు హాజరవుతుంటారు. ఇప్పుడు ఓ స్టార్ హీరో సినిమా ఓపెనింగ్‌కు ఆయన హాజరవనున్నట్లు తెలుస్తోంది.
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్ యాక్టర్ విజయ్ హీరోగా తెలుగు, తమిళం భాషల్లో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రం షూటింగ్ అక్టోబర్‌లో ప్రారంభం కానుంది. ఈ ప్రారంభోత్సవానికి మహేశ్ బాబు ముఖ్య అతిథిగా హాజరై.. ఈ చిత్ర యూనిట్‌కు బెస్ట్ విషెష్ చెప్పనున్నారని సమాచారం. మహేశ్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం జాతీయ అవార్డును సైతం సొంతం చేసుకుంది. ప్రస్తుతం మహేశ్ బాబు సర్కార్ వారి పాట చిత్ర షూటింగ్‌లో బిజీ బిజీగా ఉన్నారు.
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా నటిస్తున్న చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వంశీ పైడిపల్లి, దిల్ రాజు, మహేశ్ బాబు మధ్య మంచి స్నేహమున్న సంగతి తెలిసిందే. అలాగే మహేశ్, విజయ్ కూడా సన్నిహిత స్నేహితులే. మహేశ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ఒక్కడు, పోకిరి తమిళ రీమేక్స్‌లో విజయ్ హీరోగా నటించాడు. విజయ్ చిత్ర షూటింగ్ ప్రారంభ కార్యక్రమానికి మహేశ్ బాబు వస్తున్నారని తెలిసి... మహేశ్ బాబు ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
![]() |
![]() |