![]() |
![]() |

రోడ్డు ప్రమాదంలో సాయిధరమ్ తేజ్ గాయపడి మూడు వారాలు గడిచాయి. ఇంకా ఆయన వైద్యుల పర్యవేక్షణలోనే అపోలో ఆసుపత్రిలో చికిత్సను పొందుతున్నారు. ఇటీవల 'రిపబ్లిక్' ప్రీ రిలీజ్ వేడుకలో సాయితేజ్ ఇప్పటికీ కోమాలోనే ఉన్నాడని పవన్‌కల్యాణ్ వ్యాఖ్యానించడంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై అందరిలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, మీడియా కథనాలు ప్రసారం చేసిన సమయంలో కోమాలో ఉన్నారని పవన్ చెప్పారని దర్శకుడు దేవ్ కట్టా స్పష్టత ఇచ్చారు.
అయినా... కొద్ది రోజులుగా వైద్యుల నుంచి ఎలాంటి హెల్త్ బులెటిన్స్ వెలువడకపోవడంతో సాయితేజ్ నిజంగానే కోమాలో ఉన్నాడనే నిశ్చయానికి చాలా మంది అభిమానులు వస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం సాయిధరమ్ హెల్త్ గురించి సంగీత దర్శకుడు తమన్ కీలకమైన అప్‌డేట్ ఇచ్చారు.
సాయిధరమ్ హెల్త్ క్రమంగా మెరుగవుతోందని తమన్ పేర్కొన్నారు. "మీ అందరి పూజలు ఫలించాయి. నా స్నేహితుడు సాయితేజ్ కోలుకుంటున్నాడు. మరికొద్ది రోజుల్లో అతడిని కలవబోతున్నాను" అంటూ ట్విట్టర్ ద్వారా తమన్ పేర్కొన్నారు. సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం 'రిపబ్లిక్' అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానున్నది. రాజకీయ, సామాజికంశాల సమ్మేళంగా రూపొందుతున్న ఈ చిత్రానికి దేవ్ కట్టా దర్శకత్వం వహించారు.
![]() |
![]() |