![]() |
![]() |

ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కి కేరాఫ్ అడ్రస్ లా నిలిచిన కథానాయకుల్లో విక్టరీ వెంకటేశ్ ఒకరు. వెంకీ నటించిన పలు కుటుంబ కథా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించాయి. వాటిలో `అబ్బాయిగారు` ఒకటి. తమిళ చిత్రం `ఎంగ చిన్న రాసా` (కె. భాగ్యరాజ్, రాధ) ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో వెంకీకి జంటగా మీనా నటించగా.. జయచిత్ర, శ్రీకాంత్, కోట శ్రీనివాసరావు, నూతన్ ప్రసాద్, బ్రహ్మానందం, బాబూమోహన్, మల్లికార్జునరావు, ఏవీయస్, శివాజీరాజా, వై. విజయ, లతా శ్రీ ఇతర ముఖ్య పాత్రల్లో అలరించారు. రాశి మూవీ క్రియేషన్స్ పతాకంపై ఎం. నరసింహారావు నిర్మించిన ఈ చిత్రాన్ని ఈవీవీ సత్యనారాయణ రూపొందించారు. హాస్యబ్రహ్మ జంధ్యాల సంభాషణలు సమకూర్చారు.
స్వరవాణి కీరవాణి సంగీతమందించిన ఈ చిత్రానికి వేటూరి సుందరరామ్మూర్తి, భువనచంద్ర, వెన్నెలకంటి సాహిత్యమందించారు. ``ఓ కన్నెపువ్వా``, ``కూసింది కోయిలమ్మ``, ``అమ్మ అమ్మ``, ``వెన్నెలకు ఏం తెలుసు``, ``నీ తస్సదియ్యా``, ``తడికెందుకు అదిరింది``.. ఇలా ఇందులోని పాటలన్ని విశేషాదరణ పొందాయి. 1993 సెప్టెంబర్ 30న విడుదలై అఖండ విజయం సాధించిన `అబ్బాయిగారు`.. నేటితో 28 వసంతాలు పూర్తిచేసుకుంటోంది.
![]() |
![]() |