![]() |
![]() |

చార్ట్ బస్టర్ ఆల్బమ్స్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ.. ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు యువ సంగీత సంచలనం తమన్. `గాడ్ ఫాదర్`, `అఖండ`, `NBK 107`, `భీమ్లా నాయక్`, `సర్కారు వారి పాట`, `SSMB 28`, `RC 15`, `గని`, `థాంక్ యూ`.. ఇలా పలు క్రేజీ ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉన్న ఈ టాలెంటెడ్ కంపోజర్.. తాజాగా మరో భారీ బడ్జెట్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.
ఆ వివరాల్లోకి వెళితే.. కోలీవుడ్ స్టార్ విజయ్ కథానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ బైలింగ్వల్ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న ఈ బిగ్ టికెట్ ఫిల్మ్ ని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించనున్నారు. త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. 2022లో తెరపైకి రానుంది. కాగా, ఈ చిత్రానికి అనిరుధ్ బాణీలు అందించే అవకాశం ఉందని కొన్నాళ్ళ క్రితం కథనాలు వచ్చాయి. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఇప్పుడా అవకాశం తమన్ కి దక్కిందట. రాజు నిర్మాణంలో పలు చిత్రాలకు బాణీలు అందించిన తమన్.. వంశీ రూపొందించిన రెండో చిత్రం `బృందావనం`కి చార్ట్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చాడు. త్వరలోనే `విజయ్ 66`లో తమన్ ఎంట్రీపై క్లారిటీ రానుంది.
![]() |
![]() |