![]() |
![]() |

తనీష్, ముస్కాన్ సేథీ జంటగా నటించిన చిత్రం 'మరో ప్రస్థానం'. ఈ చిత్రానికి జాని దర్శకత్వం వహించారు. ఈ యాక్షన్ మూవీని హిమాలయ స్టూడియో మాన్షన్స్, ఉదయ్ కిరణ్ సమర్పణలో మిర్త్ మీడియా సంస్థ నిర్మించింది. ఈ నెలాఖరుకు 'మరో ప్రస్థానం' చిత్రాన్ని విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
'మరో ప్రస్థానం' సినిమా విషయానికి వస్తే.. రియల్ టైమ్, రీల్ టైమ్ ఒకటే ఉండటం ఈ సినిమా స్పెషాలిటీ. సినిమాలో కథ ఎంత టైమ్ లో జరిగితే, సరిగ్గా అదే టైమ్ కు సినిమా కంప్లీట్ అవుతుంది. సింగిల్ షాట్ ప్యాటర్న్ లో ఎలాంటి కట్స్, జర్క్స్, రివైండ్ షాట్స్ లేకుండా స్ట్రైట్ స్క్రీన్ ప్లే తో 'మరో ప్రస్థానం' చిత్రాన్ని రూపొందించారు.
రెగ్యులర్ గా వచ్చే సినిమాలకు పూర్తి భిన్నంగా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కిందని మూవీ టీమ్ చెబుతోంది. ఇది ఓ ఎమోషనల్ కిల్లర్ జర్నీ అని.. కథ, కథనం సరికొత్తగా ఉంటుందని అంటున్నారు. సినిమా చూస్తున్న ప్రేక్షకులు తర్వాత సీన్ లో ఏం జరుగుతుందో అని ఉత్కంఠతో చూసేలా డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో ఈ సినిమాను తెరకెక్కించారట. ఇటీవల కాలంలో వచ్చిన కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలకు ఆదరణ లభించడంతో.. ఈ సినిమా సక్సస్ పై మూవీ టీమ్ గట్టి నమ్మకంతో ఉంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు.
![]() |
![]() |