![]() |
![]() |

దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న పిరియడ్ డ్రామా 'ఆర్ ఆర్ ఆర్'. చారిత్రక పురుషులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ చుట్టూ అల్లుకున్న ఈ పాన్ - ఇండియా మూవీలో అల్లూరిగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, కొమురంగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దర్శనమివ్వనున్నారు. చరణ్ కి జంటగా ఆలియా భట్ కనిపించనుండగా.. తారక్ సరసన ఓలివియా మోరీస్ సందడి చేయనుంది. ఇతర ముఖ్య పాత్రల్లో అజయ్ దేవగణ్, శ్రియా శరణ్ అలరించనున్నారు.
ఇదిలా ఉంటే.. `ఆర్ ఆర్ ఆర్`లో దాదాపు అన్ని ముఖ్య పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ లకు రివీల్ చేసిన యూనిట్.. త్వరలో శ్రియ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయనుందని సమాచారం. శ్రియ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 11న ఈ పోస్టర్ ని విడుదల చేయబోతున్నట్లు వినికిడి. ఇప్పటికే మేకింగ్ వీడియోలో శ్రియ లుక్ ని రివీల్ చేసిన యూనిట్.. బర్త్ డే స్పెషల్ గా ఆమె పాత్రని పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ వదలబోతున్నట్లు టాక్. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే మరో రెండు రోజులు వేచిచూడాల్సిందే.
కాగా, `ఛత్రపతి` (2005) వంటి బ్లాక్ బస్టర్ తరువాత రాజమౌళి దర్శకత్వంలో శ్రియ నటించిన సినిమా ఇది. ఇందులో అజయ్ దేవగణ్ కి జంటగా దర్శనమివ్వనుంది శ్రియ.
![]() |
![]() |