![]() |
![]() |

పదకొండేళ్ళ సుదీర్ఘ విరామం అనంతరం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మరోమారు జట్టుకట్టారు సూపర్ స్టార్ మహేశ్ బాబు. `అతడు` (2005), `ఖలేజా` (2010) తరువాత మహేశ్, త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్ లో రానున్న ఈ భారీ బడ్జెట్ మూవీని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో మహేశ్ బాబుకి జంటగా పూజా హెగ్డే కనువిందు చేయనుండగా.. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ బాణీలు అందించనున్నారు.
ఇదిలా ఉంటే.. మహేశ్, త్రివిక్రమ్ థర్డ్ జాయింట్ వెంచర్ నవంబర్ నుంచి పట్టాలెక్కనుందని.. ఇదో రివెంజ్ డ్రామా అని ఫిల్మ్ నగర్ లో జోరుగా ప్రచారం సాగుతోంది. అంతేకాదు.. ఇందులో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ప్రతినాయకుడిగా నటించబోతున్నట్లు కథనాలు వస్తున్నాయి. అదే గనుక నిజమైతే.. 23 ఏళ్ళ అనంతరం టాలీవుడ్ లో సంజయ్ కనిపించనున్న సినిమా ఇదే అవుతుంది. గతంలో ఆయన కింగ్ నాగార్జున నటించిన `చంద్రలేఖ` (1998)లో అతిథి పాత్రలో అలరించారు. త్వరలోనే `మహేశ్ 28`లో సంజయ్ ఎంట్రీపై క్లారిటీ రానుంది.
కాగా, సంజయ్ ప్రతినాయకుడిగా నటించిన పాన్ - ఇండియా మూవీ `కేజీఎఫ్: ఛాప్టర్ 2` 2022 ఏప్రిల్ 14న థియేటర్స్ లో సందడి చేయనుంది. ప్రధానంగా కన్నడంలో రూపొందిన ఈ సినిమా తెలుగులోనూ అనువాదం కానుంది.
![]() |
![]() |