![]() |
![]() |

సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తొలిసారిగా ఓ తెలుగు సినిమాని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ పాన్ - ఇండియా మూవీని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇందులో చరణ్ కి జంటగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని నటిస్తుండగా.. అంజలి, జయరామ్, సునీల్ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందించనున్నారు. బుధవారం ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి.
ఇదిలా ఉంటే.. ఈ చిత్రానికి ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్ ని ఫిక్స్ చేశారని టాక్. ఇంతకీ అదేమిటంటే.. `విశ్వంభర`. అయితే, ఈ టైటిల్ తెలుగుకే పరిమితమా? లేదంటే అన్ని భాషలకూ ఇదే శీర్షికని ఉంచుతారా? అన్న విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. త్వరలోనే టైటిల్ కి సంబంధించి ఫుల్ క్లారిటీ రానుంది. మరి.. చరణ్, శంకర్ ఫస్ట్ కాంబినేషన్ లో రానున్న ఈ భారీ బడ్జెట్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
కాగా, 2023 సంక్రాంతికి `#RC 15` థియేటర్స్ లోకి రానుందంటూ ప్రచారం జరుగుతోంది.
![]() |
![]() |