![]() |
![]() |

రెండు వారాల క్రితం డైరెక్టర్-ప్రొడ్యూసర్ విఘ్నేశ్ శివన్‌తో ఎంగేజ్‌మెంట్‌ను కన్ఫామ్ చేసింది లేడీ సూపర్‌స్టార్ నయనతార. త్వరలోనే వారు వివాహం చేసుకోవడానికి ప్లాన్ చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు పెళ్లి, ఆ తర్వాత జరిగే ఆచారవ్యవహారాలతో నయన్, విఘ్నేశ్ బిజీగా మారుతున్నారు. ఇప్పటిదాకా తను ఒప్పుకున్న సినిమా కమిట్‌మెంట్స్‌ను పూర్తి చేసే పనిలో తీరికలేకుండా ఉంది నయన్. ప్రస్తుతం ఆమె పూణేలో షారుక్ ఖాన్ సరసన చేస్తున్న సినిమా షూటింగ్‌లో ఉంది. ఈ మూవీని తమిళ దర్శకుడు అట్లీ రూపొందిస్తున్నాడు. లేటెస్ట్‌గా.. పెళ్లయ్యాక నయన్ నటనకు దూరమవుతుందంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పెళ్లి తర్వాత కొత్త సినిమాలకు ఆమె సంతకం చేయదా అని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. అయితే ప్రొఫెషనల్ లైఫ్‌కూ, పర్సనల్ లైఫ్‌కూ నయన్ ముడిపెట్టదనీ, మ్యారేజ్ తర్వాత కూడా ఆమె నటిస్తుందనీ ఆమె సన్నిహిత వర్గాలు అంటున్నాయి.
పెళ్లయ్యాక తను నటించనని జరుగుతున్న ప్రచారాన్ని నయనతార స్వయంగా ఖండించినట్లు సమాచారం. ఇటీవల 'నేత్రికన్' మూవీలో అంధురాలిగా అద్భుతమైన అభినయాన్ని ప్రదర్శించిన ఆమె, అతడి ఫ్యామిలీని విఘ్నేశ్ శివన్ ప్రేమించే విధానంతో అతడంటే తనకు ప్రేమ, గౌరవం ఏర్పడ్డాయని తెలిపింది. ఆరేళ్లుగా తనతో బంధాన్ని కొనసాగిస్తున్నా, అతడి ప్రేమలో, సంకల్పంలో ఎలాంటి మార్పూ కనిపించలేదని ఆమె అంటోంది. నయన్, విఘ్నేశ్ ఈ ఏడాది చివరలో కానీ, 2022 ఆరంభంలో కానీ పెళ్లాడనున్నట్లు చెప్పుకుంటున్నారు.
పని విషయానికి వస్తే.. నయనతార ప్రస్తుతం రజనీకాంత్‌తో 'అణ్ణాత్తే' సినిమా చేస్తోంది. ఇందులో మీనా, ఖుష్‌బూ, కీర్తి సురేశ్, జాకీ ష్రాఫ్ కీలక పాత్రధారులు. అలాగే విజయ్ సేతుపతి, సమంతతో కలిసి 'కాదువాకుల రెండు కాదల్' సినిమా చేస్తోంది. ఈ మూవీకి విఘ్నేశ్ శివన్ దర్శకుడు. అట్లీ డైరెక్ట్ చేస్తున్న సినిమా విషయానికి వస్తే, మొదట అందులో నటించడానికి ఆమె ఇష్టపడలేదనీ, తనకు ఆఫర్ చేసిన క్యారెక్టర్ నచ్చకపోవడమే దీనికి కారణం అనీ ఇండస్ట్రీలో ప్రచారంలోకి వచ్చింది. దాంతో ఆమె పాత్రను అట్లీ తిరిగి రాశాడనీ, అప్పుడు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనీ సమాచారం.
![]() |
![]() |