![]() |
![]() |

'నిన్ను కోరి' సినిమాతో టాలీవుడ్ కి దర్శకుడిగా పరిచయమై మొదటి సినిమాతోనే మెప్పించాడు శివ నిర్వాణ. ఆ తర్వాత తీసిన 'మజిలీ' మూవీతో సూపర్ హిట్ అందుకున్న శివ.. త్వరలో 'టక్ జగదీష్' సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. అయితే ఈ టాలెంటెడ్ డైరెక్టర్ త్వరలో రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేయనున్నట్టు తెలిపారు.
నేచురల్ స్టార్ నాని, శివ నిర్వాణ కాంబినేషన్ లో గతంలో వచ్చిన 'నిన్ను కోరి' విజయాన్ని అందుకుంది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో 'టక్ జగదీష్' రాబోతోంది. వినాయకచవితి కానుకగా ఈ నెల 10 నుంచి అమెజాన్ ప్రైమ్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న శివ నిర్వాణకు ఒక ప్రశ్న ఎదురైంది. విజయ్ దేవరకొండతో మూవీ గురించి ఆయనను అడగగా.. ఆ ప్రాజెక్టు ఆగిపోలేదని, తమ కాంబినేషన్లో సినిమా ఉంటుందని శివ నిర్వాణ స్పష్టం చేశారు.
కాగా గతంలో విజయ్ దేవరకొండ- శివ నిర్వాణ కాంబినేషన్ లో సినిమా రానుందని వార్తలొచ్చాయి. అయితే శివ చెప్పిన కథ నచ్చక పోవడంతో విజయ్ ఆ ప్రాజెక్ట్ కి నో చెప్పినట్టుగా అప్పట్లో ప్రచారం జరిగింది. తాజాగా అలాంటిదేం లేదని శివ క్లారిటీ ఇవ్వడంతో.. త్వరలో వీరి కాంబినేషన్ లో ఓ సినిమా వచ్చే అవకాశముంది.
![]() |
![]() |