![]() |
![]() |

రౌడీ హీరో విజయ్ దేరకొండ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. ఇండియన్ ఐడల్ సీజన్ 12 ఫైనల్స్ కి చేరిన తెలుగమ్మాయి షణ్ముక ప్రియకు విజయ్ తన సినిమాలో పాడే అవకాశం ఇచ్చాడు.
'ఇండియన్ ఐడల్ 2021' గ్రాండ్ ఫినాలేలో షణ్ముఖ ప్రియ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇండియన్ ఐడల్ హిస్టరీలో గ్రాండ్ ఫినాలేకు తెలుగు ఫీమేల్ సింగర్స్ లలో ఎవరు చేరుకోలేదు. ఆ రేర్ ఫీట్ ను చిన్న వయసులోనే షణ్ముఖ ప్రియ సాధించింది. అయితే తుది సమరంలో ఆమె టైటిల్ ను గెలుచుకోలేకపోయినా.. ప్రేక్షకుల మనసును గెలుచుకుంది. అలాగే విజయ్ దృష్టిని ఆకర్షించింది. షణ్ముఖ ప్రియ ఫైనల్స్ కు చేరుకున్న సమయంలో విజయ్ ఆమె కోసం ఒక స్పెషల్ వీడియోను పంపించాడు. 'నువ్వు గెలిచినా గెలవకపోయినా హైదరాబాద్ కు రాగానే నేను నిన్ను కలుస్తాను. అలాగే నువ్వు నా సినిమాలో పాట పాడతావు' అంటూ హామీ ఇచ్చేశాడు. ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకున్నాడు విజయ్.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'లైగర్' సినిమాలో షణ్ముఖ ప్రియకు పాడే అవకాశం ఇచ్చాడు విజయ్. అలాగే చెప్పినట్లుగానే షణ్ముఖ ప్రియను విజయ్ కలిశాడు. షణ్ముఖ ప్రియ, ఆమె తల్లి హైదరాబాద్ లోని విజయ్ ఇంటికి వెళ్ళగా.. విజయ్ తల్లి వారిని రిసీవ్ చేసుకున్నారు. అంతే కాకుండా వారిని తెలుగు సంప్రదాయ పద్దతిలో మర్యాదపూర్వకంగా గౌరవించారు. షణ్ముక ప్రియను సన్మానించి చీరలు, బహుమతులను అందజేశారు.
![]() |
![]() |