![]() |
![]() |

ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి. విభిన్న పాత్రలు, చిత్రాలతో నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న సేతుపతి.. చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ 'లాభం'. శ్రుతిహాసన్ హీరోయిన్ గా.. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 9 న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సేతుపతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కృతిశెట్టిని తన పక్కన హీరోయిన్‌గా ఊహించుకోలేనని అన్నాడు.
వైష్ణవ్ తేజ్- కృతిశెట్టి జంటగా నటించిన సూపర్ హిట్ మూవీ 'ఉప్పెన'. ఈ మూవీలో సేతుపతి.. కృతిశెట్టికి తండ్రిగా రాయణం పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. తాజాగా లాభం మూవీ ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కూతురు పాత్ర పోషించిన కృతిశెట్టితో రొమాన్స్ చేయలేను అన్నారు. ఉప్పెన సినిమా తర్వాత సేతుపతి నటించిన ఓ తమిళ సినిమాలో మొదట హీరోయిన్‌గా కృతిశెట్టి అయితే బావుంటుందని దర్శకనిర్మాతలు భావించారట. కానీ, అందుకు సేతుపతి ఒప్పుకోలేదట. ఉప్పెన సినిమాలో ఆమెకు తండ్రిగా నటించి, ఇప్పుడు ఆమెతో రొమాన్స్ చేయమంటే చేయలేనని, తనని నా పక్కన హీరోయిన్‌గా ఊహించుకోలేనని చెప్పాడట.
భవిష్యత్తులోనూ కృతిశెట్టితో కలిసి జంటగా నటించలేనని చెప్పాడు. ఉప్పెన క్లైమాక్స్ షూటింగ్ చేస్తున్నప్పుడు కృతి కాస్త కంగారు పడింది. దీంతో 'బేబమ్మ.. నాకు నీ అంత వయసున్న కొడుకు ఉన్నాడు. నువ్వు కూడా నా కూతురు లాంటిదానివి. భయపడకు.. ధైర్యంగా చేయ'మని ప్రోత్సహించాను. కూతురిలా భావించిన అమ్మాయితో జోడీగా నటించడం నా వల్ల కాదు అని విజయ్ సేతుపతి చెప్పుకొచ్చాడు.
![]() |
![]() |