Home

»

Latest News

అప్పుడు ఐట‌మ్ నంబ‌ర్.. ఇప్పుడు సెకండ్ లీడ్..

Sep 6, 2021 4:05PM

పెళ్ళ‌య్యాక కూడా న‌టిగా త‌న‌దైన ముద్ర వేస్తోంది ప్రియ‌మ‌ణి. మ‌రీముఖ్యంగా.. ప్ర‌ముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అయిన `ద ఫ్యామిలీ మ్యాన్` సిరీస్ తో ఈ నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ యాక్ట్ర‌స్ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఈ క్ర‌మంలోనే.. విక్ట‌రీ వెంక‌టేశ్ స‌ర‌స‌న `నార‌ప్ప‌`లో అవ‌కాశం పొందింది ప్రియ‌మ‌ణి. ఇటీవ‌లే త‌న ల‌క్కీ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అయిన `నార‌ప్ప‌`లో మ‌రోసారి త‌న‌దైన అభిన‌యంతో అల‌రించింది ఈ టాలెంటెడ్ యాక్ట్ర‌స్.

ఇదిలా ఉంటే.. ఎనిమిదేళ్ళ క్రితం షారుక్ ఖాన్ బాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ `చెన్నై ఎక్స్ ప్రెస్` (2013)లో ``1 2 3 4 గెట్ ఆన్ ద డ్యాన్స్ ఫ్లోర్`` అంటూ స్పెష‌ల్ సాంగ్ లో ఐట‌మ్ గాళ్ గా సంద‌డి చేసిన ప్రియ‌మ‌ణి.. సుదీర్ఘ విరామం అనంత‌రం షారుక్ తో మ‌రోమారు జ‌ట్టుక‌ట్టింది. కాక‌పోతే, ఈ సారి సెకండ్ లీడ్ గా ఆమె క‌నిపించ‌నుంద‌ని స‌మాచారం. ఆ వివ‌రాల్లోకి వెళితే.. కోలీవుడ్ కెప్టెన్ అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో షారుక్ హీరోగా ఓ మాస్ ఎంట‌ర్టైన‌ర్ రూపొంద‌నుంది. ఇందులో షారుక్ ద్విపాత్రాభిన‌యం చేయ‌నున్నాడ‌ని టాక్. అంతేకాదు.. మెయిన్ లీడ్ గా న‌య‌న‌తార న‌టిస్తుండ‌గా.. సెకండ్ లీడ్ రోల్ ని ప్రియ‌మ‌ణి చేస్తోంద‌ని వినికిడి. 

మ‌రి.. షారుక్ కి రెండోసారి కూడా ప్రియ‌మ‌ణి ప్ల‌స్ అవుతుందేమో చూడాలి. కాగా, 2022 ద్వితీయార్ధంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ థియేట‌ర్స్ లో  సంద‌డి చేసే అవ‌కాశ‌ముంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com