![]() |
![]() |

ఈ దసరా నటసింహం నందమూరి బాలకృష్ణ అభిమానులకు ఎంతో స్పెషల్ కానుంది. ఎందుకంటే.. ఈ సీజన్ లో సందడంతా బాలయ్యదే ఉండబోతోందట. `సింహా`, `లెజెండ్` వంటి బ్లాక్ బస్టర్స్ తరువాత తన లక్కీ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో బాలయ్య చేస్తున్న `అఖండ` దసరా కానుకగా విడుదల కాబోతోందని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.
అంతేకాదు.. ఇదే సీజన్ లో `క్రాక్` కెప్టెన్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో కొత్త చిత్రాన్ని పట్టాలెక్కించబోతున్నారు బాలయ్య. అలాగే.. వరుస విజయాల దర్శకుడు అనిల్ రావిపూడితో చేయబోతున్న సినిమా తాలూకు అధికారిక కబురు కూడా అదే సమయంలో వినిపించబోతున్నారు నటసింహం.
మొత్తమ్మీద.. దసరా సీజన్ లో బాలయ్య సరదాలు పంచనున్నారన్నమాట. మరి.. రాబోయే చిత్రాలతో ఈ నందమూరి సీనియర్ స్టార్ తన స్థాయి విజయాలను అందుకుంటారేమో చూడాలి. కాగా, ఈ లోపే `అఖండ` పాటలతో యూట్యూబ్ ముంగిట బాలకృష్ణ సందడి చేయబోతున్నారు.
![]() |
![]() |