![]() |
![]() |

కేరళకుట్టి కీర్తి సురేశ్ ప్రస్తుతం మూడు బిగ్ టికెట్ ఫిల్మ్స్ తో బిజీగా ఉన్నారు. ఆ చిత్రాలే.. `అణ్ణాత్తే` (తమిళ్), `సర్కారు వారి పాట`, `భోళా శంకర్`. `సర్కారు వారి పాట`లో మహేశ్ బాబుకి జంటగా నటిస్తున్న కీర్తి.. రజినీకాంత్ నటిస్తున్న `అణ్ణాత్తే`లో కూతురిగానూ, చిరంజీవి నటిస్తున్న `భోళా శంకర్`లో చెల్లెలుగానూ కనిపించనున్నారు.
ఇదిలా ఉంటే.. అటు రజినీ, ఇటు చిరు కాంబినేషన్ లో కీర్తి చేస్తున్న సినిమాలకి సంబంధించి ఓ ఆసక్తికరమైన కనెక్షన్ ఉంది. అదేమిటంటే.. ఈ రెండు సినిమాల్లోనూ `కలకత్తా` నేపథ్యం ఉండడం. `అణ్ణాత్తే`లో కథానుసారం కొంత భాగం కలకత్తాలో నడుస్తుంది. అంతేకాదు.. `భోళా శంకర్`లోనూ ఆ నగరం చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు ఉండబోతున్నాయి. మరి.. కలకత్తా నేపథ్యంలో సాగే ఆయా చిత్రాలతో కీర్తి ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాలి.
కాగా, `అణ్ణాత్తే`ని శివ డైరెక్ట్ చేస్తుండగా.. `భోళా శంకర్`ని మెహర్ రమేశ్ రూపొందిస్తున్నారు.ఈ దీపావళికి `అణ్ణాత్తే` తెరపైకి రానుండగా.. `భోళా శంకర్` 2022 ద్వితీయార్ధంలో రిలీజ్ కానుంది.
![]() |
![]() |