![]() |
![]() |

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం `ఆచార్య`ని పూర్తిచేసే పనిలో ఉన్నారు. మరోవైపు `ఆర్ ఆర్ ఆర్` నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. అలాగే సంచలన దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో మరికొద్ది రోజుల్లో కొత్త చిత్రాన్ని పట్టాలెక్కించబోతున్నారు చరణ్. ఈ మూడు ప్రాజెక్ట్స్ పై భారీ అంచనాలే ఉన్నాయి.
ఇదిలా ఉంటే.. చరణ్ తన 16వ చిత్రాన్ని `జెర్సీ` దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో చేయబోతున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఈ సినిమాని ఎన్వీ ప్రసాద్ తో కలిసి రామ్ చరణ్ స్వయంగా నిర్మిస్తారట. అంతేకాదు.. 2022 ద్వితీయార్ధంలో ఈ భారీ బడ్జెట్ మూవీ సెట్స్ పైకి వెళ్ళనుందని సమాచారం. త్వరలోనే చరణ్, గౌతమ్ కాంబో మూవీపై మరింత క్లారిటీ రానున్నది. మరి.. ఫస్ట్ టైమ్ చరణ్ తో చేయనున్న ఈ సినిమాతో గౌతమ్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.
కాగా, గౌతమ్ అప్ కమింగ్ ప్రాజెక్ట్ అయిన `జెర్సీ` హిందీ వెర్షన్ దీపావళి కానుకగా నవంబర్ 5న తెరపైకి రానుంది. ఇందులో షాహిద్ కపూర్, మృణాళ్ ఠాకూర్, పంకజ్ కపూర్ ముఖ్య పాత్రల్లో నటించారు.
![]() |
![]() |