![]() |
![]() |

కోలీవుడ్ స్టార్ సూర్య చేతిలో ప్రస్తుతం నాలుగు చిత్రాలున్నాయి. ఆ సినిమాలే.. `జై భీమ్`, `ఎదర్కుమ్ తుణిందవన్`, ఆర్.టి. నేశన్ డైరెక్టోరియల్, `వాడివాసల్`. వీటిలో `జై భీమ్`, `ఎదర్కుమ్ తుణిందవన్` ఈ ఏడాదిలోనే తెరపైకి రానున్నాయి. అంతేకాదు.. ఈ రెండు సినిమాలు కూడా పండగల సమయంలోనే జనం ముందుకు వస్తున్నాయి.
ఆ వివరాల్లోకి వెళితే.. టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో సూర్య నటించిన కోర్ట్ డ్రామా `జై భీమ్`. ఇందులో సూర్య లాయర్ గా కనిపించబోతున్నారు. దీపావళి కానుకగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది. ఇక `ఎదర్కుమ్ తుణిందవన్` విషయానికి వస్తే.. పాండిరాజ్ దర్శకత్వంలో సూర్య నటిస్తున్న ఈ యాక్షన్ డ్రామా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. మరి.. తక్కువ గ్యాప్ లోనే రాబోతున్న ఈ రెండు సినిమాలతో సూర్య ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాలి.
కాగా, `జై భీమ్`లో సూర్యకి జోడీగా `కర్ణన్` ఫేమ్ రాజీషా విజయన్ నటించగా.. `ఎదర్కుమ్ తుణిందవన్`లో `గ్యాంగ్ లీడర్` ఫేమ్ ప్రియాంక అరుళ్ మోహన్ నాయికగా నటిస్తోంది.
![]() |
![]() |