![]() |
![]() |

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. ఆ తర్వాత నిర్మాతగా మారి బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్నారు బండ్ల గణేష్. గబ్బర్ సింగ్, టెంపర్ వంటి హిట్ సినిమాలను నిర్మించిన ఆయన.. కొన్నేళ్లుగా సినీ నిర్మాణానికి దూరంగా ఉంటున్నారు. కొంత విరామం తర్వాత 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రీఎంట్రీ ఇచ్చిన ఆయన.. మరోవైపు పవన్ కళ్యాణ్ హీరోగా ఓ సినిమా నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే గత కొద్దిరోజులుగా బండ్ల గణేష్ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నారని టాక్ వినిపిస్తోంది. తాజాగా దీనిపై అధికారిక ప్రకటన వచ్చింది.
వెంకట్ చంద్రను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. యష్ రిషి ఫిలిమ్స్ పతాకంపై స్వాతి చంద్ర నిర్మిస్తున్న సినిమాలో బండ్ల గణేష్ హీరోగా నటించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. తమిళ హిట్ మూవీ 'ఒత్తు సెరుప్పు సైజ్ 7'కి రీమేక్ ఇది. తమిళంలో ఆర్. పార్తిబన్ పోషించిన పాత్రను తెలుగులో బండ్ల గణేష్ చేస్తున్నారు. ఈ పాత్ర కోసం ఆయన పత్యేకంగా మేకోవర్ అయ్యారు. ఈ మూవీ నుంచి బండ్ల గణేష్ లుక్ ని తాజాగా విడుదల చేశారు. ఆయన లుక్ ఆకట్టుకుంటోంది.
కాగా, 'ఒత్తు సెరుప్పు సైజ్ 7'ను హిందీలో కూడా రీమేక్ చేస్తున్నారు. ఇందులో అభిషేక్ బచ్చన్ హీరోగా నటిస్తున్నారు.
![]() |
![]() |