![]() |
![]() |

పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో సాగర్ చంద్ర దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'భీమ్లా నాయక్'. మలయాళ సూపర్ హిట్ మూవీ 'అయ్యప్పనుమ్ కోషియం'కు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. పవన్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2 న భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ ని మూవీ టీమ్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సాంగ్ కి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా ఈ సాంగ్ లో సాకీని పాడిన తెలంగాణ జానపద కళాకారుడు దర్శనం మొగులయ్యకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. అయితే తాజాగా ఆయనకు పవన్ ఆర్థిక సాయం చేసి మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు.
తెలంగాణలోని అమ్రాబాద్ ఫారెస్ట్ ప్రాంతానికి చెందిన మొగులయ్య మొగులయ్య ఊరూర తిరుగుతూ కిన్నెర వాయించి.. ఆ వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించే వారు. తాజాగా ఆయన 'భీమ్లా నాయక్' సినిమాలోని టైటిల్ సాంగ్ తో అందరి దృష్టిని ఆకర్షించారు. మొగులయ్య సాకీతో ఆ పాటకు వన్నె వచ్చిందని అందరూ ప్రశంసిస్తున్నారు. అయితే అంత ప్రతిభ ఉన్న మొగులయ్య చాలా కష్టాల్లో ఉన్నారని తెలుసుకున్న పవన్.. ఆయనకు 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేశారు. ఈ మేరకు జనసేన కార్యాలయం ఓ ప్రకటనను విడుదల చేసింది.
కాగా, 12 మెట్ల కిన్నెర వాయించే అతి తక్కువ వ్యక్తులలో మొగులయ్య ఒకరు. ఆయన ప్రతిభను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం గతంలో ఆయనను సత్కరించింది.
![]() |
![]() |