![]() |
![]() |

విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'అశోకవనంలో అర్జున కళ్యాణం'. ఈ సినిమాకి విద్యా సాగర్ చింతా దర్శకత్వం వహిస్తున్నాడు. బీవీఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో ఎస్వీసీసీ డిజిటల్ బ్యానర్ పై బాపినీడు, సుధీర్ ఈదర సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి విశ్వక్ సేన్ పాత్రని పరిచయం చేస్తూ ఒక వీడియోని విడుదల చేసింది చిత్రబృందం.
'మీట్ అర్జున్ కుమార్ అల్లం' పేరుతో విడుదల చేసిన వీడియోలో విశ్వక్ సేన్ లుక్ గత చిత్రాలకు భిన్నంగా ఉంది. క్లీన్ షేవ్, మీసకట్టు, పొట్టతో కొత్తగా కనిపిస్తున్నాడు. "వయస్సు 30 దాటిపోయింది. జుట్టు ఊడిపోతోంది. పొట్ట కూడా వచ్చింది. అమ్మాయి దొరకడం లేదు. మీరే సంబంధం చూసి పెట్టండి. నాకు ఎలాంటి పట్టింపులు లేవు. కట్నం కూడా వద్దు" అంటూ విశ్వక్ సేన్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఇక ఈ వీడియోకి జై క్రిష్ అందించిన మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

అల్లం అర్జున్ కుమార్ కు వధువు కావాలని చెబుతూ పోస్టర్ కూడా విడుదల చేసింది మూవీ టీమ్. చింతా మ్యారేజ్ బ్యూరో పేరుతో ఉన్న అప్లికేషన్ ఫామ్ లో అర్జున్ ఫోటో, బయోడేటా ఉన్నాయి. మొత్తానికి తాజాగా విడుదలైన 'అశోకవనంలో అర్జున కళ్యాణం' మూవీ వీడియో, పోస్టర్ ఆకట్టుకుంటున్నాయి.
![]() |
![]() |