![]() |
![]() |

2021 వినాయక చవితి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ కి ఎంతో ప్రత్యేకం కానుంది. ఎందుకంటే.. ఆ రోజున రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ కోసం తను స్వరపరిచిన గీతాలు యూట్యూబ్ ముంగిట సందడి చేయనున్నాయి.
ఆ వివరాల్లోకి వెళితే.. `క్రాక్` వంటి సెన్సేషనల్ హిట్ తరువాత మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటించిన చిత్రం `ఖిలాడి`. రమేశ్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ థ్రిల్లర్ కి డీఎస్పీ బాణీలు అందించారు. కాగా, వినాయక చతుర్థి సందర్భంగా సెప్టెంబర్ 10న ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేయబోతున్నట్లు యూనిట్ ప్రకటించింది. రవితేజ, డింపుల్ హయాతిపై చిత్రీకరించిన రొమాంటిక్ నంబర్ ఇది. కట్ చేస్తే.. అదే రోజున దేవి శ్రీ కంపోజ్ చేసిన మరో సింగిల్ రాబోతోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ టైటిల్ రోల్ లో నటిస్తున్న `పుష్ప` నుంచి ఈ సాంగ్ పలకరించనుంది. ఇది కూడా రొమాంటిక్ సాంగేనని బజ్. ఇప్పటికే ఫస్ట్ సింగిల్ `దాక్కో దాక్కో మేక` చార్ట్ బస్టర్ గా నిలవడంతో.. సెకండ్ సింగిల్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎటొచ్చి ఈ పాటకు సంబంధించిన అఫిషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇంకా రాలేదు. అయితే, ఇన్ సైడ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం పాట రావడమైతే పక్కా అంటున్నారు.
మరి.. వినాయక చవితికి డీఎస్పీ ఇవ్వబోతున్న ఈ డబుల్ ధమాకా.. మ్యూజిక్ లవర్స్ ని ఏ రేంజ్ లో మెస్మరైజ్ చేస్తుందో చూడాలి.
![]() |
![]() |