![]() |
![]() |

అక్కినేని చిన్నోడు అఖిల్ ఇప్పటివరకు ముచ్చటగా మూడు సినిమాల్లో కథానాయకుడిగా సందడి చేశాడు. `అఖిల్`(2015), `హలో`(2017), `మిస్టర్ మజ్ను`(2019).. ఇలా అఖిల్ హీరోగా నటించిన ఈ మూడు చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాయి. ఈ నేపథ్యంలో.. రాబోయే సినిమా `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్`పైనే ఆశలు పెట్టుకున్నాడు ఈ స్టార్ కిడ్. `బొమ్మరిల్లు` భాస్కర్ రి-ఎంట్రీ మూవీగా తెరకెక్కిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో `బుట్టబొమ్మ` పూజా హెగ్డే నాయికగా నటించింది. చిత్రీకరణ పూర్తిచేసుకున్న `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్`.. విజయదశమి కానుకగా అక్టోబర్ 8న తెరపైకి రానుంది.
ఇదిలా ఉంటే.. ఇంతవరకు అఖిల్ నటించిన సినిమాలేవీ దసరా సీజన్ లో పలకరించిన సందర్భం లేదు. అఖిల్ తొలి చిత్రం `అఖిల్` అన్ సీజన్ లో రిలీజ్ కాగా.. సెకండ్ వెంచర్ `హలో` క్రిస్మస్ సీజన్ లో విడుదలైంది. ఇక `మిస్టర్ మజ్ను` రిపబ్లిక్ డే స్పెషల్ గా థియేటర్స్ లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో.. అక్కినేని హీరోలకు అచ్చొచ్చిన దసరా సీజన్ లో ఫస్ట్ టైమ్ పలకరించబోతున్న అఖిల్.. `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్`తో మోస్ట్ వాంటెడ్ హిట్ కొట్టి తాతయ్య ఏయన్నార్ బ్లాక్ బస్టర్ టైటిల్ `దసరా బుల్లోడు`ని సొంతం చేసుకుంటాడేమో చూడాలి.
![]() |
![]() |