![]() |
![]() |

మిల్కీ బ్యూటీ తమన్నాకి ఈ ఏడాది సెప్టెంబర్ ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే.. బ్యాక్ టు బ్యాక్ వీక్స్ లో రెండు చిత్రాలతో పలకరిస్తోందీ టాలెంటెడ్ యాక్ట్రస్. ఆ సినిమాలే.. `సీటీమార్`, `మాస్ట్రో`. వీటిలో `సీటీమార్` వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10న థియేటర్స్ లో సందడి చేయనుండగా.. `మాస్ట్రో` సెప్టెంబర్ 17న ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ కానుంది.
ఇదిలా ఉంటే.. తెలుగు సినిమాల పరంగా తమన్నాకి సెప్టెంబర్ మాసం అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. గతంలో ఇదే నెలలో ఆమె నటించిన రెండు సినిమాలు విడుదల కాగా.. రెండు కూడా తెలుగునాట నిరాశనే మిగిల్చాయి. ఆ సినిమాలే.. `రెబల్` (2012), `ఆగడు` (2014). యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి జోడీగా తమన్నా తొలిసారిగా నటించిన `రెబల్` 2012 డిజాస్టర్స్ లో ఒకటిగా నిలవగా.. సూపర్ స్టార్ మహేశ్ బాబుకి జంటగా మొదటిసారిగా కనిపించిన `ఆగడు` కూడా 2014 డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. ఈ నేపథ్యంలో.. ఇప్పుడదే సెప్టెంబర్ లో అటు మ్యాచో స్టార్ గోపీచంద్ సరసన ఫస్ట్ టైమ్ యాక్ట్ చేసిన `సీటీమార్`, యూత్ స్టార్ నితిన్ తో తొలిసారి కలిసి నటించిన `మాస్ట్రో` జనం ముందుకు రాబోతున్నాయి.
మరి.. ఈ సారైనా తమన్నాకి తెలుగునాట సెప్టెంబర్ మాసం కలిసొస్తుందేమో చూడాలి.
![]() |
![]() |