![]() |
![]() |

సెప్టెంబర్ 6న తమ ముందు విచారణకు హాజరు కావాల్సిందిగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు హీరోయిన్ రకుల్‌ప్రీత్‌కు సమన్లు జారీ చేశారు. కానీ అప్పుడు తనకు రావడం వీలవదనీ, మరో తేదీ నిర్ణయించాలనీ ఆమె కోరింది. ఆ రోజు షూటింగ్ ఉండటమే అందుకు కారణమని తెలిసింది. అయితే ఈడీ అధికారులు ఆమె విచారణను పోస్ట్‌పోన్ చేయకుండా ప్రిపోన్ చేయడం గమనించాల్సిన విషయం. ఆమెను నేడే విచారణకు రావాల్సిందిగా ఈడీ కోరింది. దాంతో శుక్రవారం ఉదయం హైదరాబాద్, బషీర్‌బాగ్‌లో ఉన్న ఈడీ కార్యాలయానికి వెళ్లింది రకుల్.
దీనికి సంబంధించిన విజువల్స్ ఇప్పటికే టీవీ చానల్స్ ప్రసారం చేశాయి. బందోబస్తు మధ్య ఆమె ఈడీ ఆఫీసు లోపలకి వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. బ్లూ జీన్స్, మెరూన్-వైట్-బ్లాక్ కలర్ చెక్స్ ఉన్న లాంగ్ క్యాజువల్ షర్ట్ ధరించి ఆమె ఈడీ ఆఫీసుకు వచ్చింది. ఆమె చేతిలో ఈడీ అడిగిన డాక్యుమెంట్స్ ఉన్న ఫైల్ కూడా ఉంది. అవి బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్లని ఊహించవచ్చు.
టాలీవుడ్ డ్రగ్ కేసులో మనీ లాండరింగ్, ఫెమా చట్టాల ఉల్లంఘన కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఆగస్ట్ 31న డైరెక్టర్ పూరి జగన్నాథ్, సెప్టెంబర్ 2న నటి-నిర్మాత చార్మిని ఈడీ అధికారులు ఇంటరాగేట్ చేశారు. ఈరోజు రకుల్ వంతు. నిజానికి నాలుగేళ్ల క్రితం తెలంగాణ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ విచారించిన టాలీవుడ్ సెలబ్రిటీల్లో రకుల్ లేదు. కానీ ఇప్పుడు ఆమెతో పాటు, రానాకు కూడా ఈడీ సమన్లు జారీ చేసింది.
సెప్టెంబర్ 8న రానా దగ్గుబాటి, 9న మాస్ మహారాజా రవితేజ, ఆయన డ్రైవర్ శ్రీనివాస్‌ను విచారించేందుకు ఈడీ రెడీ అవుతోంది. ఆ తర్వాత సెప్టెంబర్ 13న నవదీప్, ఎఫ్ క్లబ్ జనరల్ మేనేజర్, 15న ఐటమ్ సాంగ్స్ స్పెషలిస్ట్ ముమైత్ ఖాన్, 17న యువనటుడు తనీశ్, 20న నటుడు నందు, 22న హీరో తరుణ్ ఈడీ అధికారుల ముందు విచారణకు హాజరవనున్నారు.
![]() |
![]() |