![]() |
![]() |

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాక్ ఇచ్చింది. డ్రగ్స్ కేసు విచారణ తేదీ మార్చాలని కోరుతూ ఈడీకి రకుల్ ప్రీత్ సింగ్ లేఖ రాయగా.. ఆమె రిక్వెస్ట్ ను ఈడీ అధికారులు రిజెక్ట్ చేశారు.
నాలుగేళ్ల క్రితం టాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహరం కలకలం రేపిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ కేసులో ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులపై ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ కేసుని సుదీర్ఘంగా విచారించిన ఎక్సైజ్ అధికారులు వాళ్లందరికీ క్లీన్ చీట్ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఈ కేసును టేకప్ చేసిన ఈడీ మనీ లాండరింగ్ చట్టం కింద 12 మంది సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసింది. ఆ లిస్టులో పూరీ జగన్నాథ్, ఛార్మి, రకుల్, రానా, రవితేజ, నవదీప్, ముమైత్ ఖాన్, తనీశ్, తరుణ్ తదితరులు ఉన్నారు. ఇప్పటికే పూరి జగన్నాథ్, ఛార్మి విచారణకు హాజరయ్యారు.
కేసు విచారణలో భాగంగా ఈ నెల 6న రకుల్ ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉంది. వరుస షూటింగ్స్‌తో ఫుల్ బిజీగా ఉండటంచేత తాను ఇప్పుడే విచారణకు హాజరు కాలేనని.. కొంత గడువు ఇవ్వాలని ఆమె ఈడీని కోరింది. అయితే రకుల్ రిక్వెస్ట్‌ను ఈడీ రిజెక్ట్ చేసింది. ముందుగా నోటీసులు ఇచ్చిన ప్రకారం ఈ నెల 6న విచారణకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది.
![]() |
![]() |