![]() |
![]() |
.jpg)
ప్రస్తుతం టాలీవుడ్ లో మెగా కాంపౌండ్ హీరోల హవా నడుస్తోంది. ఒక క్యాలెండర్ ఇయర్ లో ఈ క్యాంప్ నుంచి డజనుకి పైగా చిత్రాలు సందడి చేస్తుండడం ఇందుకు నిదర్శనం. అంతేకాదు.. రాబోయే నెలల్లోనూ ఇదే తీరు కొనసాగుతోంది. మరీముఖ్యంగా.. అక్టోబర్ నుంచి జనవరి వరకు ప్రతీ నెలలోనూ మెగా కాంపౌండ్ హీరోల చిత్రాలు సందడి చేయనున్నాయి. నెలల వారిగా ఆ సినిమాల వివరాల్లోకి వెళితే..
అక్టోబర్ః- ఈ నెలలో మెగా కాంపౌండ్ నుంచి రెండు చిత్రాలు రానున్నాయి. ఆ సినిమాలే.. `రిపబ్లిక్`, `కొండ పొలం`. సాయితేజ్ హీరోగా నటించిన `రిపబ్లిక్` అక్టోబర్ 1న విడుదల కానుండగా.. అక్టోబర్ 8న అతని తమ్ముడు, `ఉప్పెన` హీరో వైష్ణవ్ తేజ్ నటించిన `కొండ పొలం` రిలీజ్ కానుంది.
నవంబర్ః- నవంబర్ నెలలో మెగా కాంపౌండ్ నుంచి రాబోతున్న సినిమా `గని`. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్నాడు. దీపావళి కానుకగా నవంబర్ తొలి వారంలో `గని` థియేటర్స్ లో సందడి చేయనుంది.
డిసెంబర్ః- డిసెంబర్ మాసంలో మెగా కాంపౌండ్ నుంచి ఓ పాన్ - ఇండియా మూవీ రాబోతోంది. ఆ చిత్రమే `పుష్ప`. అల్లు అర్జున్ టైటిల్ రోల్ లో నటిస్తున్న `పుష్ప` రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా.. మొదటి భాగం `పుష్ప - ద రైజ్` క్రిస్మస్ కానుకగా డిసెంబర్ ద్వితీయార్ధంలో తెరపైకి రానుంది.
జనవరిః- జనవరి నెలలో సంక్రాంతి కానుకగా మెగా కాంపౌండ్ నుంచి వస్తున్న చిత్రం `భీమ్లా నాయక్`. పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్ లో నటించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ జనవరి 12న థియేటర్స్ లో సందడి చేయనుంది.
ఈ సినిమాలే కాదు.. చిరంజీవి - రామ్ చరణ్ కాంబినేషన్ లో రూపొందుతున్న `ఆచార్య`, జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి రామ్ చరణ్ నటించిన పాన్ - ఇండియా మూవీ `ఆర్ ఆర్ ఆర్` కూడా అక్టోబర్ - జనవరి పిరియడ్ లోనే సిల్వర్ స్క్రీన్ పైకి రాబోతున్నాయి. `ఆచార్య`కి ఇంకా రిలీజ్ డేట్ కన్ఫామ్ కాకపోగా.. అక్టోబర్ 13న రావాల్సిన `ఆర్ ఆర్ ఆర్` సంక్రాంతికి వాయిదాపడినట్లు టాలీవుడ్ టాక్. వీటితో పాటు చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ నటించిన `సూపర్ మచ్చి` కూడా ఈ పిరియడ్ లోనే తెరపైకి వచ్చే అవకాశముంది.
మరి.. నాలుగు నెలల పాటు సాగే ఈ మెగా సినీజాతరలో ఏయే చిత్రాలు విజయఢంకా మ్రోగిస్తాయో చూడాలి.
![]() |
![]() |