![]() |
![]() |

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు గురువారం నటి, నిర్మాత ఛార్మి కౌర్ హాజరయ్యారు. ఈడీ కార్యాలయానికి ఉదయమే ఆమె చేరుకున్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నాలుగేళ్ళ క్రితం కలకలం సృష్టించిన డ్రగ్స్ కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ చట్టం కింద తాజాగా పన్నెండు మంది ప్రముఖులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే దర్శకుడు పూరి జగన్నాథ్ ను 10 గంటల పాటు విచారించింది. నేడు ఛార్మి వంతు వచ్చింది.
ఈడీ కార్యాలయానికి ఛార్మి చేరుకున్న సమయంలో... కార్యాలయంలోకి వెళ్లేందుకు దారి దొరకలేదు. అంతలా ఆమె కారు చుట్టూ జనం పోగయ్యారు. అందులో ప్రధాన స్రవంతికి చెందిన మీడియా ప్రతినిధులు పలువురు ఉన్నారు. వీడియో తీసుకోవానికి పోటీపడ్డారు. పలువురు సెల్ ఫోన్ లలో వీడియో షూట్ చేస్తూ కనిపించారు. 'మీరు కొద్దిగా దారి ఇవ్వండి సార్. (ఆఫీసులోకి) ఎలా వెళతాను?' అని ఛార్మి రిక్వెస్ట్ చేశారు. ఈలోపు మహిళా అధికారులు మీడియాను పక్కకి జరగమని చెప్పారు. అనంతరం ఆమె ఈడీ ఆఫీసులోకి వెళ్లారు.
ఛార్మి వ్యక్తిగత, నిర్మాణ సంస్థకు చెందిన బ్యాంక్ ఖాతాలను ఈడీ అధికారులు పరిశీలించనున్నట్టు తెలుస్తుంది. బ్యాంక్ లావాదేవీల్లో మనీ లాండరింగ్ కోణంలో ఏవైనా తప్పిదాలు జరిగాయేమో చూడనున్నారు.
![]() |
![]() |