![]() |
![]() |

పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో సాగర్ కే చంద్ర దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'భీమ్లా నాయక్'. మలయాళ సూపర్ హిట్ మూవీ 'అయ్యప్పనుమ్ కోషియం' రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో భీమ్లా నాయక్ అనే పవర్ ఫుల్ పొలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన మూవీ ఫస్ట్ గ్లింప్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక నేడు(సెప్టెంబర్ 2) పవన్ పుట్టినరోజు సందర్భంగా భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ ని విడుదల చేశారు. ఈ సాంగ్ కి సూపర్ రెస్పాన్స్ వస్తోంది.
పవన్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2 ఉదయం 11:16 కు భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ ని విడుదల చేస్తామని ఇటీవల మూవీ టీమ్ ప్రకటించింది. చెప్పినట్లుగానే అదే సమయానికి మూవీ నుండి ఫస్ట్ సింగల్ విడుదలైంది. ఈ సాంగ్ మ్యూజిక్ లవర్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. 'ఆడ గాదు ఈడ గాదు' అంటూ ఫోక్ తో ఈ సాంగ్ ప్రారంభమైంది. భీమ్లా నాయక్ ని పరిచయం చేస్తూ మొగులయ్య పాడిన ఫోక్ వెర్షన్ చాలా బాగుంది. ఆ తర్వాత భీమ్లా నాయక్ అసలు టైటిల్ ట్రాక్ స్టార్ట్ అయింది. 'ఇరగదీసే వీడి ఫైర్ సల్లగుండ.. ఖాకీ డ్రెస్ పక్కనెడితే వీడే పెద్ద గూండా' అంటూ రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. భీమ్లా నాయక్ పాత్రని ఎలివేట్ చేస్తూ.. ప్రతి లైన్ క్యాచీగా, హమ్ చేసుకునేలా లిరిక్స్ ఉన్నాయి. శ్రీకృష్ణ, పృథ్వీ చంద్ర, రామ్ మిరియాల ఈ సాంగ్ ని ఆలపించారు. వారి గాత్రం ఈ సాంగ్ కి చాలా ప్లస్ అయింది. పవర్ స్టార్ రేంజ్ కి తగ్గట్లుగా చాలా పవర్ ఫుల్ గా పాడారు. ఇక ఫైనల్ గా ఈ సాంగ్ కి ప్రాణం తమన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇటీవల తన మ్యూజిక్ తో ఎన్నో సంచలనాలు సృష్టిస్తున్న తమన్.. భీమ్లా నాయక్ తో మరోసారి సంచలనం సృష్టిస్తాడు అనడంలో సందేహం లేదు. భీమ్లా నాయక్ టైటిల్ ట్రాక్ కోసం ఆయన అందించిన మ్యూజిక్ చాలా ఫ్రెష్ గా ఉంది. పవన్ రేంజ్ కి తగ్గట్లు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చి మెప్పించాడు.
'భీమ్లా నాయక్' టైటిల్ సాంగ్ విడుదలైన నిమిషాల వ్యవధిలోనే యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తూ.. పవన్ రేంజ్ ని మరోసారి ప్రూవ్ చేసింది. ఫాస్టెస్ట్ వ్యూస్, ఫాస్టెస్ట్ లైక్స్ తో దూసుకుపోతుంది. ముందు ముందు ఈ సాంగ్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
కాగా, భీమ్లా నాయక్ సంక్రాంతి కానుకగా 2022 జనవరిలో విడుదల కానుంది. 'వకీల్ సాబ్' సినిమాతో రీఎంట్రీ ఇచ్చి మెప్పించిన పవన్.. 'భీమ్లా నాయక్' తో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.
![]() |
![]() |