![]() |
![]() |

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ను మెగాస్టార్ చిరంజీవి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. నేడు చెన్నై వెళ్లిన చిరంజీవి.. స్టాలిన్ను ఆయన కార్యాలయంలో కలిశారు. స్టాలిన్ తోపాటు ఆయన తనయుడు ఉదయనిధి స్టాలిన్ కూడా ఉన్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి గా పదవి చేపట్టిన దగ్గరి నుండి స్టాలిన్ తనదైన మార్క్ పాలనతో ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ క్రమంలో రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు స్టాలిన్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా చెన్నై వెళ్లిన చిరంజీవి కూడా స్టాలిన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి ఫ్యామిలీకి, స్టాలిన్ ఫ్యామిలీకి మొదటి నుంచి సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ క్రమంలోనే చిరంజీవి స్టాలిన్ను మర్యాదపూర్వకంగా కలిశారని తెలుస్తోంది.
మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా స్టాలిన్ పాలన పై ప్రశంసలు కురిపించారు. "ఏ పార్టీ అయినా అధికారంలోకి రావడానికి రాజకీయం చేయాలి కానీ.. అధికారంలోకి వచ్చాక చేయకూడదు. ఈ విషయాన్ని మీరు మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తున్నారు. మీ పాలన, మీ ప్రభుత్వ పనితీరు మీ ఒక్క రాష్ట్రానికే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలకూ, అన్ని రాజకీయ పార్టీలకు మార్గదర్శకం. మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేస్తున్నాను" అంటూ పవన్ తాజాగా ట్విట్టర్ వేదికగా ప్రశంసించారు.
![]() |
![]() |