![]() |
![]() |

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతిరత్నాలు సినిమాలతో టాలీవుడ్ లో క్రేజీ హీరోగా మారిపోయాడు నవీన్ పోలిశెట్టి. వరుస ఆఫర్స్ తలుపు తడుతున్నా.. ఏ మాత్రం తొందర పడకుండా ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. కథ నచ్చకపొతే నిర్మొహమాటంగా రిజెక్ట్ చేస్తున్నాడు. తాజాగా ఓ ప్రముఖ నిర్మాణ సంస్థకి కథ నచ్చలేదంటూ ఏకంగా అడ్వాన్స్ వెనక్కి ఇచ్చి షాక్ ఇచ్చాడు.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో నవీన్ ఓ సినిమా చేయాల్సి ఉంది. ఓ నూతన దర్శకుడు చెప్పిన స్టొరీ నవీన్ కి నచ్చింది. కానీ ఆ స్టొరీలో ఆయన అనేక మార్పులను సూచించాడు. నవీన్ చెప్పిన విధంగా రచయితలతో కలిసి దర్శకుడు కథతో కుస్తీ పట్టినప్పటికీ, నవీన్ కి ఆ కథ సంతృప్తికరంగా అనిపించలేదట. దాంతో ఆ ప్రాజక్టు నుంచి తప్పుకుంటూ.. తాను తీసుకున్న అడ్వాన్స్‌ని నిర్మాతలకు తిరిగి ఇచ్చేశాడట నవీన్.
స్టొరీ నచ్చక నవీన్ నిర్మాతలకు అడ్వాన్స్ తిరిగి ఇచ్చాడన్న న్యూస్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నవీన్ కోసం కొత్త స్క్రిప్ట్ ల వేటలో పడిందని సమాచారం.
![]() |
![]() |