![]() |
![]() |
.jpg)
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తో కోలీవుడ్ కెప్టెన్ అట్లీ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో లేడీ సూపర్ స్టార్ నయనతార బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుండగా.. కోలీవుడ్ యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ బాణీలు అందించనున్నారని సమాచారం.
ఇదిలా ఉంటే.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని హిందీతో పాటు తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నాడట అట్లీ. అంతేకాదు.. మాస్ మసాలా కంటెంట్ తో రూపొందనున్న ఈ భారీ బడ్జెట్ మూవీకి సంబంధించి మూడు భాషల్లో మూడు డిఫరెంట్ టైటిల్స్ ఫిక్స్ చేశారని బజ్. హిందీ వెర్షన్ కి `రాజ్ వర్ధన్ ఠాకూర్`, తమిళ వెర్షన్ కి`వేలుస్వామి మురుగన్`, తెలుగు వెర్షన్ కి`కత్తి కొండల రాయుడు` అనే శీర్షికలు నిర్ణయించారని వినికిడి. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
కాగా, నవంబర్ నుంచి పట్టాలెక్కనున్న ఈ సినిమాని 2022 ద్వితీయార్ధంలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం షారుక్.. `పఠాన్` పేరుతో ఓ మూవీ చేస్తున్నారు. ఇందులో దీపికా పడుకోన్ నాయికగా నటిస్తోంది.
![]() |
![]() |