![]() |
![]() |

`క్రాక్` చిత్రంతో రి-ఎంట్రీ బాట పట్టింది అందాల తార శ్రుతి హాసన్. మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ఈ కాప్ డ్రామాతో మరో బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకుంది. ఆపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి జంటగా `వకీల్ సాబ్`లో దర్శనమిచ్చింది. ఇందులో కథానాయకుడి ఫ్లాష్ బ్యాక్ లో సందడి చేసింది మిస్ హాసన్. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. ఈ రెండు సినిమాలు కూడా ఫెస్టివల్ సీజన్స్ లోనే థియేటర్స్ లో రిలీజయ్యాయి. `క్రాక్` ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కాగా.. `వకీల్ సాబ్` ఉగాది స్పెషల్ గా తెరపైకి వచ్చింది.
కట్ చేస్తే.. శ్రుతి కొత్త చిత్రం `లాభం` కూడా ఫెస్టివల్ సీజన్ లోనే రాబోతోంది. వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 9న ఈ తమిళ సినిమా విడుదల కానుంది. తెలుగులోనూ అదే పేరుతో అదే రోజున అనువాదం కానుంది. విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో నటనకు ప్రాధాన్యమున్న పాత్రలో అలరించబోతోంది శ్రుతి. మరి.. సంక్రాంతికి `క్రాక్`తో, ఉగాదికి `వకీల్ సాబ్`తో విజయాలు అందుకున్న శ్రుతి హాసన్.. వినాయక చవితికి రాబోతున్న `లాభం`తో ఫెస్టివల్ హ్యాట్రిక్ అందుకుంటుందేమో చూడాలి.
![]() |
![]() |