![]() |
![]() |

`సీమ రాజా` (2018), `మన్మథుడు 2` (2019), `జాతి రత్నాలు` (2021) చిత్రాల్లో అతిథి పాత్రల్లో దర్శనమిచ్చింది కేరళకుట్టి కీర్తి సురేశ్. కట్ చేస్తే.. త్వరలో మరో ఆసక్తికరమైన చిత్రంలో స్పెషల్ రోల్ లో కనిపించనుందట ఈ టాలెంటెడ్ యాక్ట్రస్.
ఆ వివరాల్లోకి వెళితే.. `అభిమన్యుడు` దర్శకుడు పి.ఎస్. మిత్రన్ కాంబినేషన్ లో కోలీవుడ్ స్టార్ కార్తి ఓ మూవీ చేస్తున్నాడు. `సర్దార్` పేరుతో రూపొందుతున్న ఈ సినిమాలో కార్తి ద్విపాత్రాభినయం చేస్తుండగా.. అతనికి జంటగా రాశీ ఖన్నా, `కర్ణన్` ఫేమ్ రజీషా విజయన్ నటిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ ప్రతినాయకురాలి పాత్రలో సందడి చేయనుంది. కాగా, ఈ సినిమాలో 5 నిమిషాల పాటు సాగే ఓ అతిథి వేషంలో కీర్తి సురేశ్ మెరుస్తుందట. అదే గనుక నిజమైతే.. కార్తితో కలిసి కీర్తి నటించే మొదటి చిత్రం ఇదే అవుతుంది. గతంలో కార్తి అన్న సూర్యకి జోడీగా `తానా సేరంద కూట్టమ్`లో నటించింది కీర్తి. తెలుగులో ఈ చిత్రం.. `గ్యాంగ్` పేరుతో అనువాదమైంది కూడా. మరి.. కార్తికి కీర్తి స్పెషల్ రోల్ ఏ మేరకు ప్లస్ అవుతుందో చూడాలి.
కాగా, కీర్తి చేతిలో ప్రస్తుతం `అణ్ణాత్తే`, `సర్కారు వారి పాట`, `భోళా శంకర్` చిత్రాలున్నాయి.
![]() |
![]() |