![]() |
![]() |

ఉలుకూ లేదు... పలుకూ లేదు... మండే మార్నింగ్ ఫ్యాన్స్‌కు ప్రభాస్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. సడన్‌గా 'రాధే శ్యామ్' సినిమా నుండి కొత్త పోస్టర్ రిలీజ్ చేశాడు. యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఇది ఎక్స్‌పెక్ట్ చెయ్యలేదు!దాంతో మిక్డ్స్ రెస్పాన్స్ వస్తోంది. సాధారణంగా సినిమా పోస్టర్ రిలీజ్ చెయ్యడానికి మాత్రమే కాదు, పోస్టర్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారో ఫలానా డేట్, టైమ్‌కి అప్‌డేట్ చేస్తున్నామని కూడా అప్‌డేట్స్ ఇస్తున్న రోజులివి. స్టార్ హీరోల సినిమాలకు ఇది కామన్ అయ్యింది. అటువంటిది ఎటువంటి అప్‌డేట్ లేకుండా 'రాదే శ్యామ్' నుండి కొత్త పోస్టర్ వచ్చింది.
యూవీ క్రియేషన్స్ బ్యానర్ మీద ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడుతూ ఉంటారు.. 'సలార్', 'ఆదిపురుష్' టీమ్స్ అప్‌డేట్స్ మీద అప్‌డేట్స్ ఇస్తుంటే 'రాధే శ్యామ్' నుండి సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదని. ఇప్పుడు పోస్టర్ రిలీజ్ కావడంతో కొంతమంది హ్యాపీ. కొంతమంది మాత్రం హ్యాపీగా లేరు. ఇంకెన్ని పోస్టర్లు రిలీజ్ చేస్తారని సెటైర్లు వేస్తున్నారు. సాంగ్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ సింగిల్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారో చెప్పమని అడుగుతున్నారు. మరి, యూవీ టీమ్ ఏం చేస్తుందో చూడాలి. మరోసారి సినిమాను సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 14న విడుదల చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు.
![]() |
![]() |