![]() |
![]() |

టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ నాగచైతన్య, సమంత మధ్య దూరం పెరుగుతోందనీ, వారు త్వరలో విడిపోనున్నారనీ ఆన్‌లైన్‌లో కొంతకాలంగా ప్రచారం నడుస్తోంది. ఒకరోజు ఉన్నట్లుండి, హఠాత్తుగా సమంత తన సోషల్ మీడియా హ్యాండిల్స్ నేమ్‌లోంచి 'అక్కినేని' అనే ఇంటిపేరును తొలగించడమే దీనికి కారణం. పెళ్లయ్యాక సమంత అక్కినేనిగా పెట్టుకున్న పేరులోంచి అక్కినేని అనే ఇంటిపేరును ఆమె తొలగించింది. ఆ తర్వాత సమంతగా పేరు కొనసాగించి, కొద్ది రోజుల తర్వాత కేవలం 'S' అనే అక్షరాన్ని మాత్రమే తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌కు ఉంచింది సమంత.
దీంతో సోషల్ మీడియాలోనే కాదు, ఇండస్ట్రీలోనూ అనేక అపోహలకు దారితీసింది. ప్రేమించుకొని 2017లో పెళ్లాడిన చైతూ, సమంత మధ్య అంతా సవ్యంగా లేదనీ, వారి మధ్య దూరం పెరుగుతోందనీ ప్రచారంలోకి వచ్చింది. అంతే కాదు, వారు అతి త్వరలోనే విడాకులు కూడా తీసుకుంటారంటూ కొంతమంది ఊహాగానాలు వ్యక్తం చేశారు. ఆమె తన సోషల్ మీడియా హ్యాండిల్స్ నేమ్ మార్చడం వల్ల అపోహలు తలెత్తిన విషయంపై ఓ ఇంటర్వ్యూలో ప్రశ్న ఎదురైనప్పుడు అలాంటి వాటిని స్పందించాల్సిన అవసరం లేదని తేల్చేసింది సమంత. అయితే చైతూతో తన అనుబంధం చాలా గట్టిగా ఉందనీ, తాము ఎప్పట్లానే పరస్పర అనురాగంతో ఉన్నామనీ ఆమె చెప్పలేదు. ఇది మరింత నెగటివిటీకి తావిచ్చింది.
కాగా, ఆగస్ట్ 29 తన మామయ్య నాగార్జున బర్త్‌డేని పురస్కరించుకొని సమంత చేసిన ఎమోషనల్ ట్వీట్ చైతూతో ఆమెకు ఎలాంటి గొడవలు లేవనే హింట్ ఇచ్చిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. "No words can describe my respect for you. I wish you an abundance of health and happiness, today and always.Happy birthday to the man ,the phenomena @iamnagarjuna mama" అంటూ నాగార్జునపై ఆ ట్వీట్‌లో అపారమైన అభిమానాన్ని, గౌరవాన్ని చూపించింది సమంత.
అయినప్పటికీ చాలా రోజులుగా చైతూకు సంబంధించిన ఫొటోలను కానీ, మూమెంట్స్‌ను కానీ సమంత షేర్ చేయట్లేదు. అందుకే ఆ ఇద్దరి మధ్య ప్రేమానుబంధం పలుచన అవుతోందనే, దూరం పెరుగుతోందనే ప్రచారం మాత్రం ఆగలేదు. నిజంగా చైసామ్ మధ్య బంధం ఇదివరకటిలా దృఢంగా ఉందా? ఈ ప్రశ్నకు కాలమే జవాబు చెప్తుంది.
![]() |
![]() |