Home

»

Latest News

ఈ అమ్మాయి ముందు కనిపించి ఉంటే ఎత్తుకెళ్లిపోయేవాడిని: ఆర్జీవీ

Aug 30, 2021 10:23AM

మేఘా ఆకాష్ ప్రధాన పాత్రధారిగా తెరకెక్కిన సినిమా 'డియర్ మేఘ'. సుశాంత్‌ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను అర్జున్‌ దాస్యన్‌ నిర్మించారు. ఆదిత్ అరుణ్, అర్జున్ సోమయాజుల కథానాయకులుగా నటించిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 3న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ఆదివారం రాత్రి  ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో హీరోయిన్ మేఘా ఆకాష్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

మేఘా ఆకాష్ చాలా హోమ్లీగా, క్యూట్ గా ఉంటుందని ఆర్జీవీ ప్రశంసలు కురిపించారు. 40 ఏళ్ల క్రితం ఇలాంటి అమ్మాయి కనిపించి ఉంటే.. తాను ఇప్పుడు ఇలా ఉండేవాడిని కాదన్నారు. 'రక్తచరిత్ర' సినిమాలో మాదిరిగా ఒక పదిమందిని చంపేసి ఆమెను ఎత్తుకెళ్లిపోయేవాడినని కామెంట్స్ చేశారు. మేఘ చాలా స్వీట్‌గా ఉంటుందని, ఆమెను కలిసిన వారికి డయాబెటిస్‌ వస్తుందని చమత్కరించారు. ఈ మూవీ సాంగ్స్, టీజర్‌, ట్రైలర్‌ చాలా బాగున్నాయన్ని చెప్పిన ఆర్జీవీ.. చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

కాగా తాజాగా విడుదలైన 'డియర్ మేఘ' ట్రైలర్ ఆకట్టుకుంటోంది. కన్నడ హిట్ మూవీ 'దియా'కు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com