![]() |
![]() |

`అతడు`, `ఖలేజా` చిత్రాల తరువాత సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో మహేశ్ కి జోడీగా `బుట్టబొమ్మ` పూజా హెగ్డే నటించనుంది. యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందించనున్నాడు. ఈ ఏడాది చివరలో రెగ్యులర్ షూటింగ్ బాట పట్టనున్న ఈ భారీ బడ్జెట్ మూవీ.. 2022 వేసవిలో థియేటర్స్ లో సందడి చేయనుంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా థీమ్ కి సంబంధించి ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. ఈ చిత్రం ఓ రివెంజ్ డ్రామాగా రూపొందనుందట. అంతేకాదు.. విజువల్ ఎఫెక్ట్స్ కి స్కోప్ ఉన్న ఈ చిత్రానికి హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేయనున్నారని సమాచారం. `సైరా.. నరసింహారెడ్డి`, `ఆర్ ఆర్ ఆర్` వంటి పాన్ - ఇండియా మూవీస్ కి పనిచేసిన హాలీవుడ్ సాంకేతిక నిపుణులు మహేశ్ - త్రివిక్రమ్ థర్డ్ జాయింట్ వెంచర్ లో జాయిన్ కానున్నారని వినికిడి. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
![]() |
![]() |